ఉత్కంఠ పెంచుతోన్న ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌’ ట్రైలర్‌

జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌’. ఎన్‌.ఎస్‌. సీ దర్శకుడు. ఆర్‌ఆర్‌ఆర్‌ పొడ్రక్షన్స్, జె.కె. క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. బెనర్జీ, మనోజ్‌ నందన్, అక్షిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ‘ఒక రోజు నేను అడవిలో వెళ్తుంటే సడన్‌గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను, పులి నా వెంట పడిందం’టూ కథానాయకుడి జీవితంలో జరిగిన సంఘటన చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సినిమాకు ఉన్నట్లు ట్రైలర్‌కు కూడా ఇంటర్వెల్‌ రూపొందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విశ్రాంత సమయం తర్వాత మళ్లీ అదే కథ వినిపిస్తాడు నాయకుడు. ‘అటు పక్కన చావు, ఇటు పక్కన చావు, పైన చావు, కింద చావు... వీటన్నింటిని దాటాలంటే... దాటాలంటే?’ ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌’ చూడాల్సిందే. ఈ చిత్రంలో దీపక్‌గా కనిపిస్తాడు చక్రవర్తి. సాయి కార్తీక్‌ సంగీతం అందించారు. థియేటర్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథ ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.