నాని కొత్త ట్రైలర్‌ చూపించేశాడు

న్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం 'అవనే శ్రీమన్నారాయణ'. ఈ సినిమా తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ' పేరుతో రానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్​ను విడుదల చేశాడు టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాని.  'లవ్లీ' ఫేమ్ శాన్వీ కథానాయిక. పీరియడ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అవినీతి పోలీసు అధికారి పాత్రలో రక్షిత్ కనిపించనున్నాడు. సచిన్ రవి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా... డిసెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన విజువల్స్​తో ట్రైలర్ ఎంతో బాగుందని టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. 2016లో కిరిక్ పార్టీలో చివరగా నటించాడు రక్షిత్. ఆ సినిమా సమయంలోనే హీరోయిన్​ రష్మికా మందణ్నతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వెళ్లాడు. అయితే 2018లో వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.