అలరిస్తున్న ‘నర్తనశాల’ ట్రైలర్‌


నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో కొన్ని సంవత్సరాల కిత్రం తెరకెక్కించిన చిత్రం ‘నర్తనశాల’. కానీ ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని మధ్యలో ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్లో పంచ పాండవులు వారి సతీమణి ద్రౌపదితో కలిసి అరణ్యవాసం బయలుదేరడం. ధర్మరాజు (శరత్‌బాబు) ద్రౌపది (సౌందర్య) సంవాదం చేస్తుండగా మధ్యలో భీముడు (శ్రీహరి) కౌరవులపై ఊగిపోతూంటాడు. ఆ తరువాత అర్జునుడు (బాలకృష్ణ) తన సోదరులైన ధర్మరాజు, భీముడు, నకులుడు, సహాదేవుడులతో సమావేశమై ఇకపై కౌరవులు ఎన్ని పాచికలు,  ఎత్తుగడలు సాగవు అంటూ.. ’’హితవు పలికారు. ట్రైలర్‌ అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే బాలకృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని అక్టోబర్‌ 20 తేదీన విడుదల చేశారు. పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్‌ అవుతోంది. ఈ నెల 24న చిత్రానికి సంబంధించిన పదిహేడు నిమిషాలు నిడివి కలిగిన సన్నివేశాలను బాలకృష్ణ విడుదల చేయనున్నారు. ‘నర్తనశాల’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారట. చిత్రం ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంతమేర సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు. 


                                 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.