ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. ‘అక్కడ చీకట్లో ఎవరవో ఎటాక్‌ చేశారంటా.. కానీ ఎవరో ఏంటో కనిపించట్లేదంటున్నారు’’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మాటలు రాని అమ్మాయిగా అనుష్క నటన ఆకట్టుకుంటుంది. మాధవన్, సుబ్బరాజు తమ తమ పాత్రలతో ఆసక్తి పెంచతున్నారు. నేపథ్య సంగీతం మరోస్థాయికి తీసుకెళ్తుంది. అంతుపట్టని రహస్యాన్ని ఛేదించే పోలీసు అధికారిగా అంజలి సంభాషణలు అంచనాలు పెంచతున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళం,హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదలవుతుంది. సంగీతం: గోపీసుందర్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.