‘నో పెళ్లి’ అంటోన్న సాయిధరమ్‌తేజ్‌!


హుషారైన చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న యువనటుడు సాయిధరమ్‌ తేజ్‌! గత ఏడాది ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మెప్పించిన సాయిధరమ్‌ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ‘నో పెళ్లి’ అంటూ సాగే పాట ఈరోజూ విడుదలైంది. నభా నటేష్‌ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంటేశ్వర సినీ చిత్రం ఎల్‌ఎల్‌పీ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటని ప్రముఖ హీరో నితిన్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. అంతేకాదు సాయిధరమ్‌ని ఉద్దేశించి నితిన్‌..‘‘ ఎన్ని రోజులు సింగిల్‌ ఉంటావో చూస్తా..కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉంటుందేమో కానీ చేసుకోవడం పక్కా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక సాయిధరమ్‌ తేజ ఈ పాటని ‘పెళ్లికానీ వారందరికీ అంకితం ఇస్తున్నట్లు’’ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

                               Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.