కురుక్షేత్రానికి ప్రిపేరైతే.. కనీసం కుస్తీలోనైనా గెలవచ్చు


‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో నటుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధాకర్‌ కొమాకుల. ఇప్పుడు కథానాయకుడిగా ‘నువ్వు తోపురా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బి హరినాథ్‌ బాబు దర్శకత్వం వహించారు. యునైటెడ్‌ ఫిలింస్‌ పతాకంపై శ్రీకాంత్‌ నిర్మించారు. నిత్య శెట్టి కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్‌ హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో పుట్టిపెరిగిన ఓ యువకుడి కథ ఇది. రోజంతా స్నేహితులతో తిరగడం.. నచ్చిన అమ్మాయిల వెంట తిరగడం ఇదే అతని దినచర్య. ఇలాంటి యువకుడికి అనుకోకుండా అమెరికా వెü™్ల అవకాశం వస్తుంది. కానీ, అక్కడికి వెళ్లాక తన దుందుడుకు తత్వం వల్ల అనుకోని చిక్కుల్లో పడతాడు. ఇదే సమయంలో ఓ ప్రమాదకరమైన ఛాలెంజ్‌ను పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సరూర్‌ నగర్‌ కుర్రాడు ఏం చేశాడు? తనకు ఎదురైనా చిక్కులేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్న నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాకర్‌ పాత్ర తీరు, తెలంగాణ యాసలో అతను పలికిన సంభాషణలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీకి అద్దం పడుతూ యువతరాన్ని మెప్పించేలా అజ్జు మహంకాళి రాసిన సంభాషణలు హైలైట్‌గా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ట్రైలర్‌తోనే సినిమాలో ఏదో మంచి విషయముందనే భావనను కలిగించింది చిత్ర బృందం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.