సందడి చేస్తోన్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ టీజర్‌

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ బుధవారం విడుదల చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన టీజర్‌ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. గత చిత్రాల మాదిరి రాజ్‌ తరుణ్‌ హుషారుగా తనదైన శైలిలో డైలాగ్స్‌ చెప్పి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అనూప్‌ నేపథ్య సంగీతం అలరిస్తుంది. నరేష్, పోసాని కృష్ణమురళి, సత్య నవ్వులు పూయిస్తున్నారు. రాజ్‌ తరుణ్‌కి, మాళవిక, హెబ్బాకు ఉన్న సంబంధం ఏంటో తెరపై చూడాల్సిందే. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కాబోతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.