ఆసక్తిగా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌

పాయల్‌ రాజ్‌పుత్‌, చైతన్య కృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. దయాల్‌ పద్మన్‌భాన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోందీ ప్రచార చిత్రం. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రల్లో దర్శనమిచ్చిన పాయల్‌ ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించిందనిపిస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ‘ఒకరు బతకాలంటే ఇంకొకరు చావాలి అదే సృష్టి’ అనే ఆసక్తికర అంశంతో వస్తుందీ చిత్రం. ప్రశాంతంగా ఉండే జీవితంలోకి వచ్చిన ఆ అతిథి ఎవరు? సైలెంట్‌గా ఉండే పాయల్‌ కిల్లర్‌గా ఎందుకు మారింది తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే. నవంబరు 20న ఆహా డిజిటల్‌ వేదికపై విడుదల కాబోతుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.