అమ్మ మనసును తట్టిలేపిన ‘పెంగ్విన్’‌ ట్రైలర్‌

జాతీయ ఉత్తమనటి అవార్డు గ్రహిత కీర్తి సురేష్‌ నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘పెంగ్విన్’‌. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. తాజాగా చిత్రం ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. కీర్తి సురేష్‌ ఇందులో తల్లిగా నటిస్తోంది. ఆమెన తన ప్రియమైన వారిని కాపాడడం కోసం ఎంతో తపిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ సమర్పణలో ఈశ్వర్ కార్తిక్‌ దర్శకత్వంలో వైవిధ్యంగా వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం గురించి కీర్తి సురేష్‌ స్పందిస్తూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో ఇదొక వైవిధ్యభరితమైన చిత్రం. ఒక తల్లిగా బిడ్డపై ఎంత ప్రేమ ఉంటుందో చూశాను. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈశ్వర్‌ కార్తిక్‌లాంటి దర్శకుడితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ, తెలుగు, తమిళ ప్రేక్షకులు ఆదుర్దగా ఎదురు చూస్తున్నారని..’’చెబుతోంది. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్, ప్యాషన్‌ స్టూడియోస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. జూన్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల అవుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.