సీన్‌ భలే ఉంది.. ఎందుకు డిలీట్‌ చేసినట్లో!!

ఏడాది ఆరంభంలో ‘చిత్రలహరి’తో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న మెగా హీరో సాయితేజ్‌.. ముగింపులో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో మరో అదిరిపోయే హిట్‌ను అందుకున్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం నిలకడైన వసూళ్లతో నేటికీ బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఓ డిలీటెడ్‌ సన్నివేశాన్ని బయటకొదిలింది. సాయితేజ్‌.. రాశీ ఖన్నా ఇంటికి వెళ్లిన సందర్భంలో వచ్చే ఈ సన్నివేశంలో సింక్‌ బ్రదర్స్‌తో ఆయన చేసే హంగామాను ఆకట్టుకునేలా ఉంది. తర్వాత సాయి.. రాశీ వాళ్ల తాతతో బయటకు రావడం అది చూసి రాశీ షాక్‌ అయి వాళ్లెందుకొచ్చారు అని తన తల్లిని అడగడం వంటి సన్నివేశాలను చూపించారు. తాతా మనవళ్లు, తండ్రీ కొడుకుల అనుబంధాల నేపథ్యంతో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులకు మోముల్లో నవ్వులు పూయిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.