‘రాగల 24 గంటల్లో’ ఏం జరగబోతుంది?

‘నా జీవితంలో అదృష్టం ఉందంటే.. అది మనం పెళ్లి చేసుకోవడమే’ అని భార్యతో చెప్పిన భర్త అనుమానస్పదంగా చనిపోతే? పోలీసుల విచారణలో ‘నా భర్తను నేనే చంపేశాను’ అని ఆ భార్య చెప్తే? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదా! ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచేందుకు ఈ కథాంశంతో రాబోతున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈషా రెబ్బా, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. సత్యదేవ్‌ చెప్పిన ఈ సంభాషణతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ సాగుతుంది. వివాహం చేసుకుని ఆనందంగా గడపాల్సిన వారు ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుతుంది. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.

                             


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.