రజనీ యాక్షన్‌ అదిరింది కదా..

మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ‘దర్బార్‌’ నుంచి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో స్టైలిష్‌ లుక్‌తో బయటకొచ్చేశారు. తాజాగా ఈ చిత్ర తెలుగు మోషన్‌ పోస్టర్‌ను హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో ఓ స్టిల్‌లో రజనీ తన చేతిలోని కత్తితో శత్రువులను చీల్చి చెండాడుతూ దర్శనమివ్వగా.. చివర్లో ఖాకీ దుస్తుల్లో చేతిలో కత్తి పట్టుకోని ఓ కుర్చీలో తనదైన స్టైల్‌లో రాజసం ఒలకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ పవర్‌ఫుల్‌గా కనిపించారు. చుట్టూ పడి ఉన్న రౌడీలను చూస్తుంటే అప్పుడే ఓ యాక్షన్‌ కోటింగ్‌ ఇచ్చి తాపీగా రిలాక్స్‌ అవుతున్నట్లుగా ఉంది. ఈ చిత్రంలో రజనీ.. ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ అధికారికగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా నయనతార నటిస్తోంది. యోగిబాబు, నివేదా థామస్, సిమ్రన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.