అతినిద్ర గాడిని పరిచయం చేసిన రామ్‌చరణ్‌
అతివృష్టి...అనావృష్టి ఏదైనా ఇబ్బందికరమే అది తిండి విషయమైనా...నిద్ర విషయమైనా అయినా సరే. శుభోదయం చెప్పి మరి అతి నిద్ర గాడిని పరిచయం చేశాడు రామ్‌ చరణ్‌. శ్రీసింహ, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. శుభోదయం కార్యక్రమానికి నమస్కారం... ఈ రోజు మనం చర్చించబోయే అంశం అతినిద్ర యొక్క లక్షణాలు.. అలుపు... అసహనం... ఆగ్రహం..ఆరాటం ఇలాంటి మాటలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది టీజర్‌. థ్రిల్లర్‌ కామెడీ సినిమా అని తెలుస్తుంది. మరి ఈ అతినిద్ర వలన అనుకోనిదేదో జరిగింది. ఈ నిద్ర మత్తు నుంచి మేల్కొని అతను ఏం చేశాడో తెలియాలంటే ‘మత్తు వదలరా’ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. డిసెంబర్‌ 25 న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకనిర్మాతలు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.