హెబ్బాతో ‘డింఛక్‌’ ఆడిస్తున్న రామ్‌!

‘దేవదాసు’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన రామ్‌ తెలుగు ప్రేక్షకులతో ‘జగడం’ పెట్టుకుని ‘రెడీ’ అంటూ మన ముందుకొచ్చాడు. ఇవాళ రామ్‌ పోతినేని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రెడ్‌’ చిత్రం నుంచి ‘డింఛక్‌’ అనే పాట టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మలు నటిస్తున్నారు. ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈరోజు విడుదలైన ‘డింఛక్‌’ పాటని ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్‌ రాయగా, మణిశర్మ స్వరాలు సమకూర్చిన గీతానికి, సాకేత్, కీర్తిన శర్మలు గొంతు కలిపారు. హెబ్బా పటేల్‌ అభినయానికి రామ్‌ రెచ్చిపోతూ చిందేసిన ఈ పాటకు జానీ మాస్టర్‌ కొరియాగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై నిర్మితమయ్యే  ఈ సినిమాలో అమృత అయ్యర్, సంపత్‌ రాజ్, వెన్నెల కిశోర్, నాసర్, పోసాని, సత్య, సోనియా అగర్వాల్, పవిత్ర లోకేష్‌ తదితరులు నటిస్తున్నారు. తమిళంలో వచ్చిన ‘తాడమ్‌’ చిత్రానికి రీమేక్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.