వీరశంకర్‌ ఆన్‌ ఫైర్‌!!

మాస్‌ మహారాజా రవితేజ పోలీసు అధికారి వీరశంకర్‌గా దర్శనమివ్వబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్‌’తో సందడి చేసేందుకు త్వరలోనే రాబోతున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతుతన్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే పునఃప్రారంభమైంది. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. మేకింగ్‌ని చూపిస్తూనే రవితేజ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని విడుదల చేశారు. ‘స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ సైలెంట్‌ పెట్టుకో’ అని రవితేజ తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు. ఇది చూస్తుంటే ఆయన ఓ రేంజ్‌లో యాక్షన్‌ అదరగొట్టారనిపిస్తుంది. తమన్‌ నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సమ్రుదఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.