న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘రన్ కల్యాణి’


గీతా జె దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్ కల్యాణి’. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క వర్చువల్ ఎడిషన్‌ జూలై 24 నుంచి ప్రారంభమై ఆగస్టు 2, 2020తో ముగుస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రారంభమైన మొదటి మలయాళ చిత్రం ఇది. చిత్ర కథేంటంటే అనారోగ్యంతో ఉన్న అత్తతో నివసించే యువతి కథను రన్ కల్యాణి చెబుతుంది. ప్రతిరోజూ మార్పులేని జీవితాన్ని గడుపుతున్నప్పుతోంది. కలలు, కోరికల గురించి కవితా - వాస్తవిక నాటకం. ప్రతి రోజు భిన్నంగా ఉంటుందని వరుస సంఘటనల ద్వారా ప్రేక్షకులకు చెప్పడానికి గీతా ప్రయత్నిస్తుంది. ఈ చిత్రానికి గీతా స్క్రిప్ట్, దర్శకత్వం వహించారు. ఇందులో మధు, రమేష్ వర్మ, గార్గి అనంతన్, మనోజ్ మీనన్, తారా కళ్యాణ్‌ తదితరులు నటించారు. చిత్రానికి మధు నీలకందన్‌ కెమెరామేన్‌గా, శ్రీలవల్సన్‌ జే మేనన్‌ సంగీతం, నిర్మాత: ఇయాన్ మెక్‌డొనాల్డ్ .Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.