అలరిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్‌


‘మారే కాలంతోపాటు మనమూ మారాలి. వయసుతోపాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’ అని బాధపడే తాతను సంతోషపెట్టేందుకు ప్రత్నిస్తాడు ఆయన మనవడు. విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల్ని పల్లెటూరికి రప్పించి అందరిలో ఆనందం నింపుతాడు. ఈ నేపథ్యంలోనే తెరకెక్కుతుంది ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం. ఇందులో తాత పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్, ఆయన మనవడిగా కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్‌ నటిస్తున్నారు. రాశిఖన్నా నాయిక. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా రూపొందించిన ట్రైలర్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ‘లంగ్‌ క్యాన్సర్‌ అడ్వాన్స్‌ స్టేజ్‌ మ్యాక్సిమమ్‌ 5 వారాలు బతికే అవకాశం ఉంది’ అని ఎమోషన్‌తో ప్రారంభమై నవ్వులు పూయిస్తుంది. సత్యరాజ్, నాయకానాయికలతోపాటు రావురమేష్‌ మాటలు ఆకట్టుకుంటున్నాయి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

                             


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.