అనుష్క మిస్సైన ‘దమయంతి’ ఇదుగో!

‘ఒసేయ్‌ దమయంతి, నాకు ఎదురుపడితేనే ఒదలను. అలాంటిది ఎదురుతిరిగితే వదులుతానా? అని అడిగిన వాడికి అన్యాయం జరిగినా అనుసరించిపోవడానికి నలచరిత్రలో వచ్చే నలదమయంతిని కాదురా. శత్రువుల గుండెలు చీల్చి మృత్యువుతో రుద్రతాండవమాడే.. దమ..దమ.. దమయంతిని రా నేను. అలాంటి నన్నే దిగ్భందించే దిమాక్‌ వచ్చిందా మీకు’ అని సమాధానమిచ్చింది నటి రాధిక కుమారస్వామి. ఆమె నటిస్తున్న ‘సంహారిణి’ చిత్రంలోది ఈ డైలాగ్‌. హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్, తెలుగు,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రాధిక చెప్పే డైలాగులు అందరినీ అలరిస్తున్నాయి. నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు బలం. టీజర్‌ చూస్తుంటే ‘అరుంధతి’, ‘భాగమతి’ చిత్రాలు ఊహకు వస్తాయి. అదే తరహా కథ కావడంతో ముందుగా ఈ పాత్రకు అనుష్కను ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. కానీ పలు కారణాల వల్ల అనుష్క ఈ అవకాశం కోల్పోవడంతో రాధిక నటించారు. రాధిక వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారనే చెప్పొచ్చు ఆమె నటనని చూసి, అంతగా మెప్పించారు. ఈమె తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నారు. కన్నడ క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి పేక్షకాధరణ పొందిన రాధిక నిర్మాతగానూ వ్యవహిరించారు. వివాహ అనంతరం సెకండ్‌ ఇన్నింగ్స్‌గా వస్తుందీ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.