సేతుపతి ‘సంఘ తమిజన్‌’ ట్రైలర్‌ ఆవిష్కరణ

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సంఘ తమిజన్‌’. అలనాటి తెలుగు నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని గురువారం చిత్ర బృందం ఆవిష్కరించారు. యాక్షన్‌ నేపథ్యంగా వస్తున్న చిత్రంలో కథానాయికలుగా రాశీఖన్నా, నివేదా పెతురాజ్‌లు నటిస్తున్నారు. ట్రైలర్‌ చూస్తుంటే విజయ్‌ పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సీనియర్‌ నటుడు నాజర్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారు. ఇంకా జాన్‌ విజయ్, సూరి తదితర నటులు నటిస్తున్నారు. బి.భారతీ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి వివేక్‌ - మెర్విన్‌లు సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల్లోనే సినిమా ప్రేక్షకుల ముందకురానుంది. విజయ్‌ సేతుపతి తెలుగులో చిరంజీవి సరసన ‘సైరా’లో నటిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.