ఆసక్తి రేకెత్తిస్తున్న ‘శాటిలైట్‌ శంకర్‌’ ట్రైలర్‌


సూరజ్‌ పాంచోలీ, మేఘా ఆకాష్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘శాటిలైట్‌ శంకర్‌’. ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సైనికుడులా కనిపించి దేశ భక్తిని చాటుతున్నాడు నటుడు సూరజ్‌. యాక్షన్‌ నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. సరిహద్దున ఉండి దేశానికి రక్షణ కల్పించే సైనికుల జీవన విధానాన్ని చక్కగా చూపించారు. మేఘా ఆకాష్‌ డైలాగ్స్‌ లేకపోయినా.. బాధలో ఉన్నట్లు కనిపిస్తుంటుంది. మురద్‌ ఖేతాని, అశ్విన్‌ వర్ధే సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

                                       


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.