ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘శక్తి’ ట్రైలర్‌

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా తమిళ దర్శకుడు పి.ఎస్‌. మిత్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శక్తి’. ప్రముఖ కథానాయకుడు అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు విద్యార్థులను మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలతో మొదలయ్యే ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తోంది. శక్తి నువ్వేమవుతావ్‌ అంటే నేను శక్తిమాన్‌లా సూపర్‌ హీరో అవుతా మిస్‌ అని చిన్ననాటి శివ (కథానాయకుడు) సమాధానమిస్తాడు.  కథ మొత్తం విద్యా వ్యవస్థ చుట్టూ తిరుగుతుందని సంభాషణలు బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ‘‘చదువుతో వ్యాపారం చేసేవాణ్ని కాదు. చదువుకున్న వాడితో వ్యాపారం చేసేవాణ్ని’’ అని ప్రతినాయకుడు చెప్పే డైలాగ్‌ ఆసక్తి పెంచుతోంది. ‘‘ఒక మనిషిని నాశనం చేయొచ్చు, వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయొచ్చు. కానీ వాడి ఆలోచనల్ని ఎవరూ నాశనం చేయలేరు’ అంటూ అర్జున్‌ అదరగొట్టారు. ‘మన విద్యా విధానంలో అందరూ చదువుకోవచ్చు, కానీ అందరూ సాధింలేరు. ఈ సిస్టమ్‌ను మార్చడానికి కామన్‌ మ్యాన్‌గా ఉంటే సరిపోదు. ఓ హీరో కావాలి’ అన్నప్పుడు సూపర్‌ హీరోగా మారిన కార్తికేయన్‌ ఏం చేశాడు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20న విడుదల కానుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.