ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘సూర్యవంశీ’ ట్రైలర్‌

అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్‌ శెట్టి దర్శకుడు. కత్రినా కైఫ్‌ నాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘మొదటిసారి 1993లో ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 2002లో బస్సు, 2006లో రైలు, 2008లో హోటల్‌ తాజ్‌పై దాడి జరిగింది. భవిష్యత్తులో వీటిని మించిన దాడి జరగబోతుందంటూ ఆరంభమయ్చే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఉగ్రవాదుల నేపథ్యంలో పూర్తి యాక్షన్‌ భరితంగా తెరకెక్కినట్లుంది. ముగ్గరు హీరోలు, నాయిక కత్రినా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సినీ అభిమానులకు కనువిందు చేశారు. యశ్‌ జోహార్, అరుణ భట్ల, కరణ్‌ జోహర్, అపూర్వ మెహతా, రోహిత్‌ శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.