కృష్ణుడు.. కంసుడు ఇద్దరూ పహిల్వాన్లే!

‘కంసుడు అధర్మం కోసం కుస్తీ చేస్తే, కృష్ణుడు ధర్మం కోసం చేశాడు. ఈ ఇద్దరూ పహిల్వాన్లే’ అంటుంది ‘పహిల్వాన్‌’ చిత్రబృందం. సుదీప్‌ కథానాయకుడుగా ఎస్.కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. ‘పహిల్వాన్‌ కుస్తీ’ పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో సుదీప్‌ చెప్పే డైలాగ్స్‌, కుస్తీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో వారాహి చలన చిత్రం ఈ సినిమాను విడుదల చేస్తోంది. కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ చేస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.