‘ఆకాశం నీ హద్దురా’ మేకింగ్‌ వీడియో

ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుల్లో సూర్య ఒకరు. పాత్ర సహజత్వం కోసం ఎంతగానో శ్రమిస్తాడు. ఒకే సినిమాలోని మాడు నాలుగు గెటప్పులకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటాడు. ప్రస్తుతం నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలోనూ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సూర్య ఎంత కష్టపడుతున్నాడో తెలియజేసే ఓ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఫ్రం స్క్రిప్ట్‌ టు స్క్రీన్‌’ పేరుతో మేకింగ్‌ వీడియో రూపొందించారు. ఇందులో దర్శకురాలు సూర్యను ఎలా చూపించాలనుకున్నారో చిత్ర బృందంతో మాట్లాడుతుండగా.. సూర్య చేస్తోన్న కసరత్తులు దర్శనమిస్తాయి. సూర్య రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. మీరూ చూడండి....



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.