బండిపై బర్త్‌డే కానుక

సుశాంత్‌ కథానాయకుడిగా నూతన దర్శకుడు దర్శన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. నో పార్కింగ్‌.. ఉపశీర్షిక. రవిశాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. బుధవారం సుశాంత్‌ పుట్టిన రోజును పురస్కరించుకోని ఈ సినిమా నుంచి ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘తియ్‌ తియ్‌ తియ్‌ బండీ’’ అంటూ బ్యాగ్రౌండ్‌ నుంచి ఓ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుండగా.. సుశాంత్‌ తన రాయల్‌ ఎన్ఫీల్డ్‌ బండీపై స్టైలిష్‌గా వస్తున్న దృశ్యాలను చూపించారు. ఆఖర్లో ఆయన్ని ఓ గ్యాంగ్‌ వెంబడిస్తున్న చూపించిన యాక్షన్‌ సన్నివేశంతో ఈ ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా ముగించారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందిస్తున్న థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణను నిలిపేసినట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.