తాప్సీని భయపెడుతున్న ‘గేమ్‌ ఓవర్‌’
                               
 ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఒవర్‌’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోంది. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్లో.. తాప్సీ పరిగెడుతూ ఉంటుంది.. ఇంట్లో ఎదురుగా ఉన్న మానిటర్‌పై వాటంతటవే గేమ్స్‌ ప్లే అవుతుంటాయి... తాప్సి గదిలోనే చక్రాల కుర్చిలో ఉంటూ భయపడుతుంటుంది... ఇంట్లో ఎవరో తరుముతున్నట్లు చక్రాలను చేతులతో ముందుకు తోసుకుంటూ అరుస్తూ ఉంటుంది... ఇంట్లో తాప్సీ తప్ప మరెవరు ఇందులో కనిపించరు... చివర్లో ఇళ్లంతా తగలబడిపోతున్నట్లు ట్రైలర్‌ ముగుస్తుంది. వై నాట్‌ స్టూడియో పతాకంపై తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌ చిత్రానికి ఎస్‌.శశికాంత్‌ నిర్మాత. జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

                                   




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.