‘ది లయన్‌ కింగ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1994లో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఇప్పుడు అదే పేరుతో 3డి వెర్షన్‌లో అలరించేందుకు సిద్ధమైంది. ఈ 3డి యానిమేటెడ్‌ ఫాంటసీని వాల్ట్‌డిస్నీ నిర్మిస్తుండగా.. జాన్‌ ఫావ్రో దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ‘ఐరన్‌ మ్యాన్‌’, ‘ది జంగిల్‌ బుక్‌’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లైవ్‌ యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సింబా అనే సింహం పిల్ల కథను చూపించబోతున్నారు. అనేక క్రూరమృగాలకు ఆవాసమైన ఓ మహారణ్యంలో పుట్టిన ఇది అక్కడి పరిస్థితులను తట్టుకుంటూ ఎలా పెరిగి పెద్దయ్యింది? ఎదిగే క్రమంలో దానికి ఎదురైన సవాü™్లంటి? తండ్రికి తగ్గ తనయుడిగా ఆ అటవి రాజ్య పగ్గాలను అందుకోగలిగిందా? తదితర అంశాలతో చిత్రాన్ని ఎంతో చక్కగా రూపొందించారు. ఈ చిత్రంలోని పాత్రలకు డోనాల్డ్‌ గ్లోవర్, సెత్‌ రోగెన్, షివెటెల్‌ ఎజిఫోర్‌ వంటి హాలీవుడ్‌ ప్రముఖులు గాత్రాన్ని అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.