రౌడీ చేతుల మీదగా తుపాకి రాముడు టీజర్‌

బుల్లి తెరపై తనదైన శైలిలో కనిపించి మెప్పించారు బిత్తిరి సత్తి. ఇప్పుడు వెండితెరపై కథానాయకుడిగా మెరవబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తుపాకి రాముడు’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం అని టీజర్‌ను బట్టి తెలుస్తుంది. బిత్తిరి సత్తి వేషధారణ, కామెడీ ప్రచార చిత్రానికి బలంగా నిలిచాయి. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.