సంజయ్‌దత్‌ ‘తొర్బాజ్’‌ చిత్రం ట్రైలర్‌ వచ్చేసింది!

ఖల్‌నాయక్‌ సంజయ్‌దత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తొర్బాజ్’‌. 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఆప్ఘనిస్తాన్, కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌ నగరంలో షూటింగ్‌ జరుపుకొంది. రెండున్నర సంవత్సరాల తరువాత సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటుంది. చిత్రం కథేంటంటే ఆఫ్ఘనిస్తాన్‌లోని చిన్నారులు - ఆత్మాహుతి దళాలుగా మారి శత్రువులను చంపడం. వారి మరణాంతరంలోనూ ధర్మం, కీర్తి వస్తుందనే భ్రమలో ఆ చిన్నారులకు శిక్షణ ఇస్తుంటారు. అయితే వారిని మార్గం నుంచి ఆర్మి అధికారి కునాల్‌ (సంజయ్‌దత్‌) తప్పిస్తాడా, హింస వైపు రాకుండా ఎలాంటి మార్గాలు ఎంచుకున్నాడనేది మిగతా కథ. నర్గీస్‌ ఫక్రీ అయేషా అనే అమ్మాయి పాత్రలో నటిస్తుంది. రాహుల్‌ దేవ్, ప్రణాష్‌ చోప్రా, హుమయూన్‌ షామ్స్‌ ఖాన్‌ తదితరులు నటిస్తున్నారు. వేవ్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సునీల్‌ పటేల్, భారతీ జక్కర్‌ మాటల రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజు చద్దా నిర్మాత. ఆ మధ్య చిత్ర నిర్మాత రాహుల్‌ మిత్ర ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్టోబర్‌ 2020లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు చివరగా డిసెంబర్‌ 11, 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.