
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. భోగి - సంక్రాంతి పండగను పురస్కరించుకొని టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్లో సన్నివేశాలతో పాటు డైలాగ్‌లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘వీడు ముస్సలోడు అవకూడదే’’. ‘‘మన ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకని దాన్నే పక్కన పెట్టేశా’’ వంటి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాటలు విడుదలై యుతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమౌతున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.