వజ్ర కవచధరుడి నవ్వుల హంగామా!

‘స
ప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాల ద్వారా కథనాయకుడిగా రాణించారు సప్తగిరి. తాజాగా సప్తగిరి, వైభవీజోషి నాయకా నాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. శివ శివమ్‌ ఫిలింస్‌ పతాకంపై రూపొందుతోంది. గతంలో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన అరుణ్‌పవార్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నువ్వు వెళ్లే దారి చావు బతుకుల మధ్యలో ఉంటుంది. ఈ ఊరిలో ఉండేవారు గుడిలోకి వెళ్లరు. నువ్వు లోపలికి వెళ్లాలంటే అక్కడ ఉన్న వారందరికీ నీ మీద నమ్మకం కలగాలి. జనం భయంలో దెయ్యాన్ని.. పూనకంలో దేవుడ్ని చూస్తారు. నువ్వు వేసే వేషం కూడా అలాంటిదే అయి ఉండాలి’’ అని సప్తగిరిని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి చెప్తున్న సంభాషణతో ట్రైలర్‌ మొదలైంది. దీన్ని బట్టీ చూస్తుంటే ఇదొక గుడి, అందులోని నిధి నిక్షేపాల చుట్టు తిరిగే కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సప్తగిరి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరొట్టేశాడు. ఓవైపు హాస్యానికి పెద్ద పీట వేస్తూనే.. మాస్‌కు కావల్సిన అన్ని అంశాలను ఇందులో వడ్డించారు. చిన్నా నేపథ్య సంగీతం, ప్రవీణ్‌ వనమాలీ ఛాయాగ్రహణం హైలైట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 14న థియేటర్లలోకి రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.