అదరగొడుతున్న ‘వకీల్‌ సాబ్‌’


ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. మహాత్మ గాంధీ, అంబేడ్కర్‌ చిత్ర పటాలతో ప్రారంభమయ్యే ఈ పోస్టర్‌ ఆద్యంతం అలరిస్తుంది. న్యాయమూర్తి గెటప్‌లో పవన్‌ కల్యాణ్‌ అదరగొడుతున్నారు. సత్యమేవ జయతే అంటూ తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. పవన్‌ అభిమానులు ఈ ట్రీట్‌తో ఫిదా అవుతున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాయికలు. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.