అంచనాలు పెంచేస్తోన్న ‘వాల్మీకి’ ట్రైలర్‌

థల ఎంపికలో వైవిధ్యత కనబరిచే మెగా హీరోల్లో అందరి కన్నా ఓ అడుగు ముందుంటాడు వరుణ్‌ తేజ్‌. తొలి చిత్రం ‘ముకుంద’ నుంచి ఇటీవల వచ్చిన ‘ఎఫ్‌ 2’ వరకు ప్రతిదీ ఓ సరికొత్త జోనర్‌కు సంబంధించిన కథాంశంతో తెరకెక్కినదే. ప్రస్తుతం ‘వాల్మీకి’ కోసం సైతం ఇదే బాటలో నడిచాడు. తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో వరుణ్ గద్దలకొండ గణేష్‌గా అద్భుతమైన నటనను కనబరిచాడు. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశంలో వరుణ్‌ తనలోని ప్రతినాయకుడు అద్భుతంగా చూపించాడు. ఇక తమిళ నటుడు అధర్వ ఈ చిత్రంలో ఓ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. నిజమైన డాన్‌తో ఓ కథను తెరకెక్కించాలనే లక్ష్యంతో గణేష్‌ వద్దకు వెళ్తాడు అధర్వ. మరి ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి. అసలు గణేష్‌ డాన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది. ఆయన గతమేంటి? చివరకు అధర్వ తాను అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించాడా? లేదా అన్నది చిత్ర కథ. ‘‘జిందగీ మాదర్‌ చోద్‌ తమ్మీ.. వట్టి గీతలే మన సేతిలో ఉంటాయి. రాతలు ఉండవు’’ అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. తమిళ నటుడు ఆధర్వ మురళీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు తెలుగు రీమేక్‌ ఇది. సెప్టెంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.