‘వాల్మీకి‘ వచ్చేశాడు

టైటిల్‌లో తుపాకి, కెమెరా రీల్‌ గుర్తులు.. ‘డైరెక్టర్‌’ లోగోతో ఓ కుర్చీ.. పోస్టర్‌ చూడగానే ఇందులో ఏదో ఉందనే ఆసక్తి అందరిలో రేకిత్తిస్తోంది ‘వాల్మీకి’. అదే తరహాలో ప్రీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. కేవలం 18 సెకన్లు నిడివి కలిగిన ప్రచార చిత్రంలో కథానాయకుడు వరుణ్తేజ్‌ని చూపించారు. వరుణ్‌ లుక్‌ యువతను ఆకర్షించేదిగా ఉంది. డైలాగ్స్‌ లేకుండా నేపథ్య సంగీతంతోనే రిలీజైన టీజర్‌ ఆకట్టుకుంటోంది. పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌ తేజ్‌ తర్వాత హరీశ్‌ మెగా హీరోని డైరెక్టు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 14రీల్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్, హీరోయిన్‌ పూజాహెగ్దే దర్శకుడు హరీశ్‌తో రెండో సారి పనిచేస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.