అలరిస్తోన్న ‘వేయి శుభములు కలుగు నీకు’ టీజర్‌

ప్రతి ఒక్కడి లైఫ్‌లో రెండు టార్గెట్స్‌ ఉంటాయ్‌. ఒకటి ఇల్లు. రెండోది పెళ్లి. ఆ టార్గెట్స్‌ నాకూ ఉన్నాయి అంటున్నాడు విజయ్‌ రాజా. ఈయన కథానాయకుడుగా రామ్స్‌ రాథోడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. తమన్నావ్యాస్‌ నాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో విజయ్‌ రాజా దర్శకుడి పాత్రలో కనిపించాడు. భయపడే డైరెక్టర్‌ కాదురా భయపెట్టే డైరెక్టర్‌ అని నాయకుడు చెప్పే డైలాగ్‌ అలరిస్తోంది. నాయిక తమన్నా వ్యాస్‌ తన అందంతో ఆకట్టుకుంటోంది. మరి హీరో తాను అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడే విజయ్‌ రాజా. కిరణ్, కిశోర్‌ సమర్పణలో జయ దుర్గ దేవీ మల్టీమీడియా పతాకంపై తూము నరసింహ పటేల్‌ నిర్మిస్తున్నారు. సంగీతం: గ్యాని, ఛాయాగ్రహణం: కె.బుజ్జి, కూర్పు: వినోద్, సంభాషణలు: శ్రీనాథ్‌ రెడ్డి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.