ఆకట్టుకుంటోన్న ‘విశాల్‌ చక్ర’ ట్రైలర్‌,


తమిళ, తెలుగు నటుడు విశాల్‌ ప్రస్తుతం ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వంలో ‘చక్ర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ఈ ట్రైలర్‌ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్థానిక హీరోల చేత చిత్ర చిత్రబృందం విడుదల చేయించింది. ఈ చిత్ర ట్రైలర్‌ని చూస్తుంటే బ్యాంక్ దొంగతనం, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా సైబర్‌ హ్యాకింగ్‌ ముఠాల గుట్టురట్టు చేసి వారిని ఎలా ఉచ్చులోకి ఆ యువకుడు ఎలా తెలుసుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ ఆఫ్‌ ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకున్నాయి. చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. మరో నటి రెజీనా కసంద్ర కూడా కీలక పాత్రలో నటిస్తుంది. విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి డాంగే, రోబో శంకర్‌, మనోబాల తదితరులు నటిస్తున్నారు.

                                 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.