ఆసక్తిగా ‘విశ్వక్‌’ టీజర్‌

అజయ్‌ కతుర్వార్, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వక్‌’. వేణు ముల్కాల దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ‘ఎన్నారైలకేమో బాధ్యత లేదు. ఇక్కడున్న వాళ్లకి నిర్లక్ష్యం’ అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి పెంచుతోంది. ఏదైనా వైరల్‌ కంటెంట్‌ రాస్తే మా ఎడిటర్‌ పబ్లిష్‌ చేస్తానన్నారని ఓ పాత్ర చెప్పగా.. ఇంతకీ కంటెంట్‌ ఏంటని మరో పాత్ర అడుగుతుంది. ది గ్రేట్‌ ఫార్మర్స్‌ సూసైడ్‌ గురించి అంటూ సమాధానం ఇవ్వగా ఎన్నాళ్లు రైతుల సమస్యల గురించి చెప్తారు చాలా సినిమాలు వచ్చాయి కదా. యువత గురించి ఆసక్తిగా ఏమైనా చెప్పొచ్చు కదా. వాళ్లలోని ఒత్తిడి, బాధ, నిరాశ అని ముగుస్తుంది. యువతను లక్ష్యం చేస్తూనే మరోవైపు ఎన్‌.ఆర్‌.ఐ.ల గురించి చెప్పుకొచ్చారు. ‘ఫుడ్, బెడ్‌ బావుందని పక్కింటికి వెళ్తావా? మంచి జీవితం ఉందని పక్క దేశం వెళ్తావా?’ అంటూ ప్రశ్నిస్తున్నాడు కథానాయకుడు. రైతుల సమస్యలు చూపిస్తారా, యువత ఏం చేస్తుందో చెప్తారా, ఎన్నారైల గురించి మాత్రమేనా? కొన్ని రోజులు ఆగాల్సిందే. గోల్డెన్‌ డక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తాడికొండ ఆనందం బాలకృష్ణన్‌ నిర్మిస్తున్నారు. సత్య సాగర్‌ పోలం సంగీతం అందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.