విడుదలకు ముందే సినిమా చూపించాడుగా
విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హిట్'. 'నేచురల్‌ స్టార్‌' నాని సమర్పణలో 'వాల్‌ పోస్టర్‌ సినిమా' బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ‘హిట్‌’ స్నీక్‌ పీక్‌ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. హత్య చేసి పొదల్లో పాతి పెట్టిన మహిళ మృతదేహాన్ని ఎంతో చాక చక్యంగా విశ్వక్‌సేన్‌ కనిపెట్టడం తదితర సన్నివేశాలతో ఉత్కంఠగా సాగింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.