‘ముక్కాబులా’ డ్యాన్స్‌తో అదరగొడుతున్నాడు

మొన్న ‘బుట్టబొమ్మ’కు స్టెప్పులు వేసి అల్లు అర్జున్‌ ప్రశంసలు అందుకున్నాడు. నిన్న ‘పోకిరి’ డైలాగ్‌ చెప్పి పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటించే అవకాశం కొట్టేశాడు. ‘బాహుబలి’గా కనిపించి భళా అనిపించుకున్నాడు. తాజాగా ఉర్రూతలూగించే గీతానికి డ్యాన్స్‌ వేసి మరోసారి అదరగొట్టాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీలో వచ్చిన ‘ముక్కాలా’ పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! ఇటీవలే ఆ పాటకు రీమీక్స్‌ కూడా వచ్చింది. టిక్‌టాక్‌ వేదికగా సతీమణితో కలిసి ముక్కాబులా రీమిక్స్‌ సాంగ్‌కి చిందులు వేశాడు డేవిడ్‌ వార్నర్‌. ఆస్ట్రేలియా క్రికెటర్‌ నటన, డ్యాన్స్‌కు తెలుగునాట మంచి ఆదరణ లభిస్తుంది. ఈసారి ఏ పాటతో అలరిస్తాడో చూడాలి.

View this post on Instagram

Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial

A post shared by David Warner (@davidwarner31) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.