‘ఏమాయ చేసావె’ సీక్వెల్‌ చూశారా!

‘ఏమాయ చేసావె’ సీక్వెల్‌ అప్పుడే వచ్చేసిందా? పూర్తి కథ అయితే రాలేదు కానీ దానికి కొనసాగింపుగా లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. వెండితెరపై వెలిగిన ప్రేమకథల్లో ‘ఏమాయ చేసావె’ ప్రత్యేకంగా నిలుస్తుంది. కార్తీక్, జెస్సీల నటన అంతగా ఆకట్టుకుంది మరి. ఈ పాత్రలు తెలుగులో నాగ చైతన్య, సమంత పోషించగా.. తమిళంలో శింభు, త్రిష నటించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమవడంతో ప్రేక్షకుల్ని ఎలా అయినా సరే అలరించాలని ఈ చిత్ర బృందం షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని భావించింది. అనుకున్న విధంగానే ఎవరి ఇంట్లో వారే చిత్రీకరణలో పాల్గొని మరోసారి మాయ చేస్తున్నారు. శింభు, త్రిష మాత్రమే ఫోన్‌లో సంభాషిస్తూ కనిపిస్తారు. త్రిష భార్య పాత్ర పోషించింది. శింభు లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్న యువ దర్శకుడిగా కనిపిస్తాడు. కథ రాయాలనుకున్న శింభుకి త్రిష గుర్తొకొచ్చి ఆమెకు ఫోన్‌ చేస్తాడు. మరి ఇద్దరి మధ్య ఏం సంభాషణ సాగిందో? చివరకు శింభు కథ పూర్తి చేశాడా, లేదా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.....



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.