అమీర్‌కు ‘లగాన్‌’ అలా దక్కింది

బాలీవుడ్‌ కథానాయకుడు అమీర్‌ ఖాన్‌ సినిమాల జాబితాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘లగాన్‌’ చిత్రం. 2001లో విడుదలైన ఈ సినిమా సంచనాలు సృష్టించింది. నాటి బ్రిటీష్‌ పాలనకు అద్దం పట్టే చిత్రం. ఓ మారుమూల పల్లె ప్రజల చుట్టూ తిరిగే కథ ఇది. పన్నుల నిర్మూలనకు, గ్రామ రూపురేఖలు మార్చుకునేందుకు పాలకులపై క్రికెట్‌ పోటీ పడి విజయం సాధిస్తారు. ఇలాంటి కథతో వచ్చి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్నాడు అమీర్‌. ఇందుకు అభిషేక్‌ బచ్చన్‌ ఓ కారణంగా చెప్పాలి. ‘లగాన్‌’లో నటించేందుకు ముందుగా చిత్ర బృందం అభిషేక్‌ బచ్చన్‌ను సంప్రదించింది. వివిధ కారణాల వల్ల అభిషేక్‌ ఈ ప్రాజెక్టును తిరస్కరించాడు.అలా ఈ అవకాశాన్ని అందుకున్న అమీర్‌ తన సత్తా భారతతీయ చిత్ర పరిశ్రమకు తెలియజేశాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.