ఆరుద్ర తొలి పాట

పక్షిరాజా స్టూడియో (కోయంబత్తూరు) అధినేత, నిర్మాత దర్శకుడు ఎస్‌.ఎమ్‌.శ్రీరామలు నాయుడు, సోదరుడు ఎస్‌.ఎమ్‌.సుబ్బయ్య నాయుడు. ఈయన సంగీత దర్శకుడు. కె.రామ్‌నాథ్‌ దర్శకత్వంలో పక్షిరాజా వారు ‘బీదలపాట్లు’ (1950) రెండు భాషల్లో తీశారు. ఆరుద్ర తొలి పాట ఈ చిత్రంలోనే రాశారు. ‘చిలుకరాజా నీ పెళ్లెప్పుడయ్యా’’ అన్నది. తరువాతి కాలంలో కొన్ని సంవత్సరాల పాటు తన సంగీతంతో ఊర్రూతలూగించిన ఎమ్‌.ఎస్‌.విశ్వనాథన్‌ ఈ సినిమాకి ‘హార్మోనియం అసిస్టెంటు’గా పనిచేశారు.

- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.