‘అగ్నిజ్వాల’ చిరు, విజయ్‌కాంత్‌ చేయాల్సిందట!

మోహన్‌ బాబు, నరేశ్‌ కథానాయకులుగా 1983లో వచ్చిన చిత్రం ‘అగ్నిజ్వాల’. కవిత, అరుణ నాయికలు. ఈ చిత్ర దర్శకుడు ముందుగా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకుని ఆ తర్వాత హీరోల కోసం అన్వేషించారు. ఎవరు బావుంటారని రచయిత పరుచూరి గోపాలరావుని అడగ్గా.. చిరంజీవి, తమిళ నటుడు విజయ్‌కాంత్‌ పేర్లు చెప్పారు. వాళ్లిద్దరు అన్నదమ్ములుగా కనిపిస్తే బావుంటుందని తన మనసులో మాట వినిపించారు. దర్శకుడు సైతం ఒకే అన్నా.. వివిధ కారణాల వల ఆ కాంబినేషన్‌ కుదరలేదు. దాంతో మోహన్‌ బాబు, నరేశ్‌ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టారు. సోదరుల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అలా చిరు, విజయ్‌ కాంత్‌లను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు రాలేదు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.