అక్కినేని మారిస్తే... ‘నో’!

‘ఇ
ద్దరుమిత్రుడు’ (1961) షూటింగ్‌ జరుగుతోంది. అక్కినేని డైలాగ్‌ చెప్తూ రిహార్సల్‌ చేస్తున్నారు. అంతలో, దూరంగా కూచున్న దుక్కిపాటి మధుసూదనరావు దిగ్గున లేచి వచ్చారు. ‘‘ఏమిటి నాగేశ్వరరావు - ఉన్న డైలాగ్‌ని మార్చి చెబుతున్నట్టున్నావు?’’ అన్నారు. ‘‘డైలాగ్‌ మార్చలేదండి. ఉన్నదాన్నే వాక్యం అటు ఇటూ చేశాను - సౌలభ్యం కోసం’’ అన్నారు అక్కినేని. ‘‘అంటే మూడునెలలు స్క్రిప్టు చదువుకున్న మాకు సౌలభ్యం తెలియలేదా?’’ అని గట్టిగానే అడిగారు దూక్కిపాటి - అందరిలోనూ! హీరో, ఆ సంస్థకు (అన్నపూర్ణ) ఛైర్మమన్‌ అయిన అక్కినేని, ఏమాత్రం చిన్నబుచ్చుకోకుండా ‘‘మీరు రాసినట్టే చెబుతాలెండి. ఇలా చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. వద్దులెండి.. అదే చెబుతాను’’ అని దృశ్యంలో ఉన్న సంభాషణే చెప్పారు - నాగేశ్వరరావు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.