అక్కినేని, శోభన్‌ పాద నమస్కారాలు!

బాపు - రమణల ‘బుద్ధిమంతుడు’ (1969) సినిమాలో శోభన్‌బాబు కృష్ణుడి వేషంలో అక్కినేనికి కనిపిస్తూ ఉంటాడు. ‘ననుపాలింప’ పాట పాడుతూ అక్కినేని, శోభన్‌బాబు పాదాలు నొక్కుతూ ఉంటాడు. ఆ షాట్సు తీస్తున్నప్పుడు శోభన్‌బాబు, ఇబ్బందిగా ఫీలయినా నటనలో తీసిపోలేదు. అయితే, ప్రతి షాటు పూర్తయాక, శోభన్‌బాబు - తన పాదాలు పట్టుకున్న అక్కినేని పాదాలను స్పృశించి అపరాధం, క్షమించమనేవారు. ఒకటి నటన ఒకటి సత్యం! నిజజీవితానికీ నటనకీ ఉన్న తేడా!


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.