అక్షయ్‌ వచ్చాడు... ఊరికి కళ తీసుకొచ్చాడు


పల్లెటూళ్లలో షూటింగులంటే ఆ సందడే వేరు. బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కమార్‌కు ఓ సినిమా సమయంలో ఒక ఊరి ప్రజలు ఎనలేని అభిమానంతో మరచిపోలేని ఆతిథ్యం అందించారట. రెండేళ్ల క్రితం ఆయన నటించిన ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’ చిత్రీకరణ పంజాబ్‌లోని మలోమల్‌ అనే మారుమూల గ్రామంలో జరిగింది. అక్కడున్నన్ని రోజులు అక్షయ్‌ని ఆ ఊరి జనం సొంత మనిషిలా చూసుకున్నారట. వారి అభిమానానికి కృతజ్ఞతగా అక్షయ్‌ తీసుకున్న నిర్ణయం ఆ ఊరికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ ఊరిలో ఉన్న అన్ని ఇళ్లకు కొత్త రంగులు వేయించేందుకు అక్షయ్‌ ముందుకొచ్చారు. చిత్రబృందం సహకారంతో రంగులు వేయించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో రాత్రికి రాత్రి ఆ ఊరు వర్ణశోభితంగా మారిపోయింది. ఇంతటి ఉదారం చూపిన అక్షయ్‌ ఆ ఊరి ప్రజల మనసుల్లో రియల్‌ హీరోగా నిలిచాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.