ఉదయం ఒక సినిమా... రాత్రి ఒక సినిమా!

అమితాబ్‌ బచ్చన్‌ మంచి డిమాండ్‌లో ఉన్న రోజులవి. ఓ పక్క ‘షోలే’, మరో పక్క ‘దీవార్‌’ సినిమాలను ఏకకాలంలో చేయాల్సి వచ్చింది అమితాబ్‌. దాంతో ఉదయం ‘షోలే’ షూటింగ్‌లోను, రాత్రి వేళల్లో ‘దీవార్‌’ షూటింగ్‌లోను పాల్గొనాల్సి వచ్చింది. ఆ కారణంగానే ‘దీవార్‌’ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు ఇండోర్‌లో, రాత్రి వేళల్లో ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలూ సూపర్‌ హిట్‌ కావడం విశేషం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.