‘అమ్మోరు’ ఘనత అదే

ఫలానా చిత్రంలో గ్రాఫిక్స్‌ అదిరిపోయింది.. తెలుగు సినిమా హాలీవుడ్‌ స్థాయిని తలపించింది.. ఇటీవలే ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. 90ల్లోనే ఈ ఘనతను సాధించింది ‘అమ్మోరు’ చిత్రం. సౌందర్య ప్రధాన పాత్రలో దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. రమ్యకృష్ణ, సురేశ్‌, రామిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎస్‌ ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని కొత్త ప్రపంచాన్ని చూపించింది. కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమాజరీ (సీజీఐ) వినియోగించిన తొలి భారతీయ చిత్రమిదే. బ్రిటిష్‌ సాంకేతిక నిపుణులు పనిచేశారు. 1995 నవంబరు 23న విడుదలైన ఈ చిత్రం ఈ యేడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. (1993లో శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మేన్‌’లో కొద్దిమేర మాత్రమే గ్రాఫిక్‌ ఉపయోగించగా ‘అమ్మోరు’కోసం పూర్తి స్థాయిలో వినియోగించారు.)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.