‘ఔరా’ అనిపించిన శివాజీ!


న్ని రంగాలు సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్న తరుణమిది. సినిమా రంగం అందుకు తక్కువేమీ కాదనడానికి తమిళ దర్శకుడు శంకర్‌ టెక్నాలజీ అడుగేస్తున్న రోజుల్లోనే అద్భుతాలు స్శష్టించాడు. ‘శివాజీ ది బాస్‌’ అదే కోవకు చెందుతుంది. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. 4కె రిజల్యూషన్‌ టెక్నాలజీ ఉపయోగించిన తొలి భారతీయ చిత్రమిదే. అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమయ్యే హాలీవుడ్‌ సినిమాల్లో మాత్రమే ఈ సాంకేతికత కనిపించేది. అలాంటిది దర్శకుడు శంకర్‌ మనకూ ఇది సాధ్యమేనని నిరూపించి ఔరా అనిపించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.