ఆఖర్లో పుట్టింది ‘బాహుబలి’ అట!!

తెలుగు చిత్రసీమ సత్తాను.. భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచ దేశాలకు రుచి చూపించారు దర్శకధీరుడు రాజమౌళి. తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌’లో ప్రదర్శితమై.. అక్కడ ప్రదర్శింపబడిన తొలి నాన్‌ - ఇంగ్లీష్‌ చిత్రంగా మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘బాహుబలి’ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు జక్కన్న. ఈ సినిమాలోని ప్రధాన పాత్రను తన తండ్రి విజయేంద్ర వర్మ తనకు మొదట చెప్పలేదని వివరించారు. ‘‘నాన్నగారు మొట్ట మొదట చెప్పింది నాకు ‘బాహుబలి’ కథ కాదు. కేవలం శివగామి పాత్ర ఒక్కటే చెప్పారు. ఆ తర్వాత భళ్లాల దేవుడు, కట్టప్ప పాత్రల గురించి చెప్పారు. ఆఖర్లో బాహుబలి పాత్రను చెప్పారు. ఆ పాత్రలు చెప్పినప్పుడు నాకు ఏదైతే ఆసక్తికరంగా అనిపించిందో.. అదే అనుభూతిని ప్రేక్షకులకు కలిగించాలనుకునే ఉద్దేశంతో ‘బాహుబలి’ చిత్రానికి శ్రీకారం చుట్టార’’న్నారు జక్కన్న.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.